సింపుల్‌గా ఉండటమే ఇష్టం


Posted by-Kalki Teamటాలీవుడ్‌లో చందమామలాంటి నాయిక ఎవరంటే టక్కున చెప్పే పేరు కాజల్‌. అందం, అభినయంతోపాటు కష్టపడేతత్వం, అంకితభావం మెండుగా ఉన్న వ్యక్తామె. ఇటీవల విడుదలైన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమాలో అర్షిదేవిగా ఆకట్టుకుంది. తన స్టైలింగ్‌ వెనకున్న రహస్యమేంటని కాజల్‌ని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ముందే ప్లాన్ చేసుకోను. నేనెలా ఉంటే బావుంటానో నా కాస్ట్యూమర్‌ నుంచి హెయిర్‌ డ్రెసర్‌ వరకు ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. వాళ్లు ఎలా మేకప్‌ చేస్తే అలాగే వేడుకల్లో పాల్గొంటా. దీనంతటికీ నా స్టైలింగ్‌ టీమ్‌ కారణం. బయటకు వెళ్లేటప్పుడు సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతాను. కానీ నా స్టైలింగ్‌ నన్ను చూసే జనాలకు ఎట్రాక్షన్‌గా ఉండాలి అని చెప్పుకొచ్చింది. మహేశ్‌బాబు సరసన రెండోసారి నటిస్తున్న బ్రహ్మోత్సవం కూడా సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.


Post Comment

Post Comment