అక్కినేని వారసులు.. పెళ్లి చేస్తే ఓ పనైపోతుంది !


Posted by-Kalki Teamఓ హీరోయిన్ తో అక్కినేని నాగచైతన్య ప్రేమ వ్యవహారంపై తెగ గాసిప్స్‌ విన్పిస్తున్న నేపథ్యంలో, అక్కినేని కాంపౌండ్‌ నుంచి మరో ప్రేమ బాణం దూసుకొచ్చింది. అక్కినేని అఖిల్‌ కూడా ప్రేమలో మునిగితేలుతున్నాడనే వార్త బయటికి వచ్చింది. దీని గురించి అఖిల్‌ స్వయంగా అఫ్ థి రికార్డు అంగీకరించాడని సమాచారం.హైదరాబాదీ అమ్మాయితో అఖిల్ ప్రేమాయణం సాగిస్తున్నాడని, ఈ విషయం ఇరు కుటుంబాల వాళ్లకూ తెలుసని ఈ వార్త సారాంశం. కాగా, ఈ విషయంపై నాగార్జున ఇప్పటికే ఓ క్లారిటీతో వున్నారని , అన్నదమ్ములిద్దరికి ఒకే సారి పెళ్లి పీఠలు ఎక్కించేసస్తే బావుంటుందని భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాల బోగట్టా. ఇదే జరిగితే త్వరలోనే అక్కినేని వారి శుభలేఖ చూడొచ్చన్నమాట.


Post Comment

Post Comment