ధోనీ విడుదల తేదీ వాయిదా :


Posted by-Kalki Teamముంబయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ. భారత క్రికెటర్‌ ధోనీ జీవితాధారంగా ఈ చిత్రాన్ని నీరజ్‌ పాండేతెరకెక్కిస్తున్నారు. అనుకున్నదాని ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్‌ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రేక్షకులకు ధోనీ చిత్రం మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో సినిమాను సెప్టెంబర్‌ 30కి వాయిదా వేసినట్లు ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ సీఈవో విజయ్‌ సింగ్‌ తెలిపారు.

సినిమా మూడు వారాలు వాయిదా వేయడం పోస్ట్‌ ప్రొడక్షన్‌ బృందానికి సినిమాను మరింత చక్కగా మలచడానికి వీలుగా ఉంటుంది.

ఈ సంవత్సరంలో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ధోనీ ఒకటి అని ఇన్‌స్పైర్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛైర్మన్‌ అరుణ్‌ పాండే అన్నారు. ఇందులో సుశాంత్‌తో పాటు కైరా అడ్వాణీ, భూమిక, అనుపమ్‌ ఖేర్‌, దిశా పటానీ, హెరీ టాంగ్రీలు నటిస్తున్నారు.


Post Comment

Post Comment