వివాదంలో అజయ్‌ శివాయ్‌


Posted by-Kalki Teamముంబయి: బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శివాయ్‌. ఇప్పుడు ఈ చిత్రంతో అజయ్‌ వివాదంలో చిక్కుకున్నట్లు కన్పిస్తోంది. చిత్ర పోస్టర్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని దిల్లీలోని కొందరు తిలక్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శివాయ్‌ పోస్టర్‌లో శివుడి విగ్రహం ఎక్కేటపుడు అజయ్‌ దేవ్‌గణ్‌ బూట్లు ధరించి ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకో పోస్టర్‌లో ఐస్‌తో చేసిన శివుడి ఆయుధం త్రిశూలాన్ని అజయ్‌ పట్టుకొని ఉన్నాడు.

అజయ్‌ దేవ్‌గణ్‌ తన సొంత బ్యానర్‌ అజయ్‌ దేవ్‌గణ్‌ ఎఫ్‌ఫిల్మ్‌ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అజయే దర్శకత్వం వహిస్తూ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. ఆయన సరసన సాయేషా సైగల్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Post Comment

Post Comment