రానాతో తొలి రోజు!


Posted by-Kalki Teamహైదరాబాద్‌: తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, కాజల్‌ అగర్వాల్‌ జంటగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇవాళ రానాతో కలిసి ఈ చిత్రం తొలి రోజు షూటింగ్‌లో పాల్గొన్నట్లు కాజల్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. దర్శకుడు తేజతో కలిసి పనిచేస్తుంటే తన కెరీర్‌ తొలి రోజులా అనిపిస్తోందని, జీవితం ఓ ఫుల్‌ సర్కిల్‌ తిరిగిందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల తరువాత తేజ దర్శకత్వంలో నటిస్తున్నానని, తొలి రోజు కలిగిన అనుభూతే ఇవాళ కలిగిందని ఆమె ట్వీట్‌ చేశారు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీకళ్యాణం చిత్రంతో కాజల్‌ తెలుగులో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.


Post Comment

Post Comment