హీరో విక్రమ్ వీడియోలో ఒక్క తెలుగు స్టార్ కూడా లేడు... కారణం..?


Posted by-Kalki Teamచెన్నయ్ వరదల బీభత్సం ఇంకా కళ్ల ముందు మెదుల్తూనే వుంది. చెన్నయ్ నిలువునా వరదల్లో మునిగి పోతూంటే.. దేశం మొత్తం చెన్నై కి బాసటగా దేశ వ్యాప్తంగా ఎందరో నిల్చున్నారు. వారిలో సినిమా నటులు వున్నారు. ఇప్పుడు ఈ స్మృతి చిహ్నంగా అన్నట్లు స్టార్ ఛియాన్ విక్రమ్ ఓ విడియో వదిలారు.

చెన్నై నగర విషాదానికి గుర్తుగా, చెన్నైవాసులకు ఇన్స్పిరేషన్ గా ఎంతో హార్ట్ టచింగ్ గా ఉన్న ఈ వీడియోలో దక్షిణాది నటీ నటులే కాదు బాలీవుడ్ తారలు కూడా నటించారు. అయితే చెన్నయ్ భీబత్సం సమయం లో తెలుగు సినీ ప్రముఖులు కూడా తామూ అండగా నిలుచుంటాం అన్న సందేశం తో పాటుగా ఆర్థికంగానూ అండగనిలిచారు. అయితే విక్రమ్ తీసిన ఈ వీడియోలో ఒక్కరంటే ఒక్క తెలుగు నటుడూ లేరు..

నిజానికి మన హీరోలకి తమిళనాడులో పెద్దగా మార్కెట్ లేదు, కానీ తమిళ సినిమాకి మన తెలుగు సినిమాలతో సమానం గా మార్కెట్ ఉంది. సూర్య, విక్రమ్, విశాల్ వంటి హీరోలకి తెలుగు హీరోలతో సమానం గా అభిమానులున్నారు. కానీ విక్రమ్ తీసిన ఈ వీడియోలో తెలుగు నటులను పెద్దగా పట్టించుకున్నట్టు లేదు.

మనవాళ్ళకి డేట్లు కుదరలేదా..? లేదంటే తెలుగు నటులని విక్రం సంప్రదించలేదా..? ఆ మధ్య ప్రభాస్ ఈ వీడియో లో కనిపిస్తారన్న వార్తలు వచ్చినా కనీసం సహాయం చేసిన సంపూర్నేష్ బాబుకి కూడా ఈ వీడియోలో అవకాశం ఇచ్చుంటే బావుండేది..

విశయం ఏదైనా కూడా కనీసం రెండు మూడు సెకన్ల పాటైనా ఒక్క తెలుగు హీరో కనిపించి ఉంటే బావుండేదేమో... ఇదే విశయం లో టాలీవుడ్ లో ఉన్న నటులు కొందరు కాస్త హర్టయ్యారని వినికిడి.


Post Comment

Post Comment