బోయపాటి తగ్గాడా? సరైనోడు సెన్సార్ రిపోర్ట్!


Posted by-Kalki Team



హైదరాబాద్: టాలీవుడ్లో యాక్షన్ సినిమాల దర్శకుడిగా పేరొందిన బోయపాటి....ఇంతకు ముందు సింహా, దమ్ము, లెజెండ్ లాంటి భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించాడు. బోయపాటి సినిమాలంటేనే రక్తం ఏరులై పారుతుంది, తీవ్రమైన హింస కూడా ఉందనే పేరుంది. ఆయన గత చిత్రాలకు ఎక్కువగా A సర్టఫికెట్ రావడమే ఇందుకు నిదర్శనం.

ప్రస్తుతం బోయపాటి సరైనోడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 22న విడుదలవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. బోయపాటి దర్శకత్వం కాబట్టి ఈ చిత్రానికి కూడా A సర్టిఫికెటే వస్తుందని అంతా భావించారు. కానీ సెన్సార్ నుండి ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది. దీన్ని బట్టి ఈ సినిమాలో బోయపాటి రక్తపాతం, హింస విషయంలో కాస్త తగ్గాడని స్పష్టమవుతోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్లో... విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో సరైనోడు తెరకెక్కింది. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేసారు. ఆడియోకు మంచి స్పందన వచ్చింది.

నిర్మాత మాట్లాడుతూ...ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరైనోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అల్లు అర్జున్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే హై ఓల్డేజ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రకుల్, కేథరీన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అల్లు అర్జున్, అంజలి కాంబినేషన్లో వచ్చే ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. అని అన్నారు.

నటీనటులు అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెస్రా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయి కుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, సురేఖా వాణి, విద్యుల్లేఖ, దేవ దర్శిని, అంజలి (ప్రత్యేక పాటలో)

సాంకేతిక వర్గం బ్యానర్ - గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ కంట్రోలర్స్ - బాబు, యోగానంద్ చీఫ్ కోఆర్డినేటర్ - కుర్రా రంగారావ్ ఆర్ట్ డైరెక్టర్ - సాయి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్ ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్ ఫైట్ మాస్టర్స్ - రామ్ లక్ష్మణ్, రవి వర్మ డిఓపి - రిషి పంజాబి డైలాగ్స్ - ఎం.రత్నం మ్యూజిక్ - ఎస్ ఎస్ తమన్ కో ప్రొడ్యూసర్ - శానం నాగ అశోక్ కుమార్ ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్ డైరెక్టర్ - బోయపాటి శ్రీను.


Post Comment

Post Comment